: రూ.2.82 కోట్లు పెట్టి రేంజ్ రోవర్ కొన్న ప్రభాస్!... రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏకు వచ్చిన ‘బాహుబలి’!


భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన యంగ్ రెబల్ స్టార్ ‘బాహుబలి’ ప్రభాస్ నిన్న ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయం(ఆర్టీఏ)లో ప్రత్యక్షమయ్యాడు. ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న అతడు కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసమే ఖైరతాబాద్ ఆర్టీఏకు వచ్చాడు. అయినా అతడు కొన్న కారు ఏ మోడలో, రేటెంతో తెలుసా? రేంజ్ రోవర్ కు చెందిన లేటెస్ట్ మోడల్ ను కొనుగోలు చేసిన ప్రభాస్... అందుకోసం ఏకంగా రూ.2.82 కోట్లు ఖర్చు పెట్టాడట. సదరు కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రభాస్ నుంచి డిజిటల్ సంతకం తీసుకున్న అధికారులు ఫొటో కూడా తీసుకున్నారు. అనంతరం అతడి కొత్త కారుకు ‘టీఎస్09ఈఎస్7567’ నెంబరును కేటాయించారు. కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా ఖైరతాబాద్ ఆర్టీఏకు వచ్చిన ప్రభాస్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు.

  • Loading...

More Telugu News