: గ్రేటర్ రాలే వాసులకు గోదావరి రెట్టింపు ఆత్మీయత
అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న ఇండియన్ రెస్టారెంట్ చైన్ ‘గోదావరి’ ఇపుడు గ్రేటర్ రాలే వాసులకు రెట్టింపు ఆత్మీయతను అందించనుంది. మారిస్‌విల్లే టౌన్‌లో గోదావరికి చెందిన రెండో రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. తద్వారా దక్షిణ భారత దేశ వంటకాలను ఆత్మీయంగా అందించేందుకు మరింతగా చేరువ అయింది. ఈ ప్రారంభోత్సవం నేపథ్యంలో టీమ్ గోదావరి సభ్యులు మాట్లాడుతూ "గ్రేటర్ రాలేలో గోదావరి మొదటి రెస్టారెంట్ ప్రారంభించిన సమయంలో మాకు అద్భుతమైన స్పందన లభించింది. మా ఫ్రాంచైజీ భాగస్వామ్యులైన శ్రీకాంత్ బాల, సతీష్ సుంకర, హనీష లు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి రెండో రెస్టారెంట్‌ను గ్రేటర్ రాలే పరిధిలో కొలువుదీర్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గ్రేటర్ రాలే పరిధిలో ప్రారంభమైన రెండో భారతీయ రెస్టారెంట్ గోదావరి ఒక్కటేనని తెలిపేందుకు మేం గర్విస్తున్నాం. మా నోరూరించే వంటకాలు మారిస్‌విల్లే వాసులనే కాకుండా నార్త్ కరోలినాలో భోజన ప్రియులందరిని అలరించడం ద్వారా అద్వితీయ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం" అని తెలిపారు. గ్రాండ్ గాలా లాంచ్ ఈవెంట్‌లో భాగంగా నోరూరించే వంటకాలతో ఏర్పాటుచేసిన భారీ బఫెట్ తో అలరించనున్నారు. "పల్లెటూరి" థీమ్‌తో గ్రామీణ నేపథ్యంలో ఈ గ్రాండ్ బఫెట్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గ్రామీణ నేపథ్యానికి ఆధునిక టచ్ ఇస్తూ వంటలు రూపొందించారు. ‘పాపారావ్’ పాపడ్ బజ్జి, ‘ఊర్వశి’ ఉల్లికారం ఇడ్లీ, ‘కిన్నెరసాని’ కౌజు పిట్ట వేపుడు, వేట మాంసం పులావ్, బొంగులో చికెన్, ‘సిల్క్ స్మిత’ స్ట్రాబెర్రి జున్ను వంటివి అమెరికాలో మొట్టమొదటిసారి వడ్డించనున్నారు. గోదావరి ప్రత్యేక మెనూలో భాగమైన విశిష్టమైన ‘చేప చిప్స్’ ‘కోడిలో బిర్యానీ’ వంటివి మరెన్నో వంటకాలు సైతం భాగస్వామ్యం పంచుకున్నాయి. దీంతో పాటుగా రెస్టారెంట్‌లో ఏర్పాటుచేసిన అద్భుతమైన బార్ (#Spicy Indian Bar) ద్వారా వెరైటీ బీర్, లిక్కర్ వంటివి రిలాక్స్‌గా ఆస్వాదించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆత్మీయ వాతావరణంలో ఈ మధుశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. 200 సీట్ల సామర్థ్యం కలిగి ఉన్న ఈ రెస్టారెంట్ దాదాపుగా 10,000 మందికి పైగా కార్పొరేట్ ఉద్యోగులు ఉన్న పెరిమీటర్ పార్క్ గేట్‌వే వద్ద కీలక స్థానంలో కొలువుదీరి ఉంది. ఈ రెస్టారెంట్ నుంచి రాలే/దుర్హం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. రీసెర్స్ ట్రయాంగిల్ పార్క్ నుంచి పది నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. దక్షిణ భారతదేశానికి చెందిన ఆత్మీయ వంటకాలే కాకుండా పలు వెరైటీ వంటకాలను సైతం గోదావరి ఇక నుంచి వడ్డించనుంది. "పుల్లారావు పులావ్" పేరుతో గోదావరి విస్తరించిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వంటకం వడ్డించనున్నారు. ఆస్టిన్‌లో ఇటీవల ప్రారంభించిన గోదావరి రెస్టారెంట్‌కు భారీ స్పందన వచ్చింది. "పంచె కట్టు" లంచ్ బఫెట్ పేరుతో వడ్డించే భోజనాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఆస్టిన్ వాసులు అందించిన ఈ ఆదరణకు గోదావరి ఆస్టిన్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతోంది. ఈ నమ్మకాన్ని, ఆత్మీయతను నిలబెట్టుకుంటూ మరిన్ని విశిష్ట వంటకాలు వడ్డించనున్నట్లు వెల్లడించింది. గోదావరి ఆస్టిన్ గ్రాండ్ ఓపెన్‌కు చెందిన ట్రైలర్ ఈ లింక్‌లో చూడవచ్చు: https://www.youtube.com/watch?v=R9vOmfdLJdc భారతీయులకు మరింత చేరువ అయ్యేందుకు గోదావరి కొత్త అడుగులు వేస్తోంది. గోదావరి రెస్టారెంట్ కార్యక్రమాలకు చెందిన ఫొటోలు, ట్రైలర్‌లు తీసే ‘షట్టర్ ఆర్మీ’తో జట్టుకట్టింది. తద్వారా తన అతిథులకు కేవలం ఆత్మీయ భోజనమే కాకుండా అద్భుతమైన అనుభూతులను అందించనుంది. గోదావరి-షట్టర్ ఆర్మీ ఒప్పందంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అందుబాటు ధరలోనే ఫొటోలు, వీడియోలు, ట్రైలర్లు అందించవచ్చు. ఇంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి భారతీయ ఆత్మీయతను గుర్తుచేసేలా మరిన్ని వంటకాలను, రుచులను అందించేందుకు గోదావరి బృందం తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. మారిస్ విల్లే, నార్త్ కరోలినాతో పాటు పరిసర ప్రాంతాల్లోని తమకు ఆదరాభిమానాలు కొనసాగుతాయని గోదావరి భరోసాతో ఉంది. ప్రతి భోజనప్రియుడిని ఆత్మీయంగా ఆహ్వానించి గోదావరి రుచులను ఆస్వాదించవలసిందిగా కోరుతోంది. అంతేకాకుండా వారి వంటకాలను పంచుకోమని ఆహ్వానిస్తోంది. ఈ జూలై 30 నుంచి మీకు ఆత్మీయతను పంచేందుకు సిద్ధం గోదావరి మారిస్‌విల్లే 100 జెరుసలేం డ్రైవ్, #108 , మారిస్‌విల్లే, నార్త్ కరోలినా-27560 ఫోన్: 919-234-6950 మా సేవలతో మీరు సదా ఆనందించగలరని ఆశిస్తూ మరోసారి కృతజ్ఞతలు. సంప్రదించండి: శ్రీకాంత్ బాల 269-779-4245 Sree@GodavariUS.com www.GodavariUS.com Press note released by: Indian Clicks, LLC