: పోలీస్‌స్టేషన్‌లోనే బైఠాయించిన జానారెడ్డి, షబ్బీర్ అలీ
మల్లన్నసాగర్ కారణంగా పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న బాధితులను పరామర్శించడానికి వెళుతోన్న టీపీసీసీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలను ఈరోజు ఉదయం పోలీసులు మెదక్ జిల్లా ఒంటిమామిడి దగ్గర అడ్డుకొని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు వారిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే, జానారెడ్డి, షబ్బీర్ అలీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము మల్లన్నసాగర్ బాధితులను పరామర్శించి తీరుతామని పోలీస్‌స్టేషన్‌లోనే బైఠాయించారు. రైతులను పరామర్శించాకే వరకు తాము హైదరాబాద్ వెళ్లబోమని స్పష్టం చేశారు.