: ఇంత చెప్పారు... హోదా గురించి ఒక్క మాటన్నా మాట్లాడారా?: విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి


ఏపీకి ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం తననెంతో నిరుత్సాహానికి గురి చేసిందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జైట్లీ సమాధానంపై ఆయన స్పందిస్తూ, సుధీర్ఘంగా సాగిన ప్రసంగంలో హోదా గురించి ఒక్క మాట కూడా లేదని ఆక్షేపించారు. "మీ ద్వారా ఆర్థిక మంత్రి దృష్టికి రెండు విషయాలను తీసుకురావాలని భావిస్తున్నాను. మొదటిది, ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 280ని ప్రస్తావించారు. దీని ప్రకారం, 14వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే సూచనలను కేవలం సిఫార్సులుగా మాత్రమే భావించే వీలుంది. వాటిని కచ్చితంగా అమలు చేయాలని లేదు. వాటినే ఫాలో కావాలన్న నిబంధనలు లేవు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలా? వద్దా? అన్న విషయాన్ని ఫైనాన్స్ కమిషన్ తేల్చలేదు. ఇక నా చివరి పాయింట్ ఏంటంటే, ఇప్పటివరకూ ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలన్నింటికీ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే ఆదేశాలు జారీ అయ్యాయి. అదే విధానాన్ని ఏపీ విషయంలోనూ పాటించాలి. మార్చి 1, 2014న అప్పటి ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించిన స్పెషల్ స్టేటస్ పై ఇప్పటి ప్రభుత్వం ఆర్డర్ జారీ చేయాలి" అని కోరారు.

  • Loading...

More Telugu News