: నేడే సెమీస్...తెలుగు టైటాన్స్ ఆట చూసేందుకు పవన్ కల్యాణ్?


ప్రో కబడ్డీ లీగ్ సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. ఇప్పటివరకు జరిగిన టోర్నీల్లో తెలుగు టైటాన్స్ అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. రెండో సీజన్ లో సెమీస్ వరకు చేరినప్పటికీ ఫైనల్ కు చేరలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో మరోసారి తెలుగు టైటాన్స్ సెమీస్ చేరడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ చౌదరి, సందీప్ నర్వాల్ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. రాహుల్ చౌదరి అద్భుతమైన ఫాంలో ఉండడం, టోర్నీలో సెంచరీ పాయింట్లు సాధించిన ఆటగాడిగా నిలవడం జట్టులో మరింత ఉత్సాహం నింపుతోంది. నేటి సాయంత్రం జైపూర్ పింక్ పాంథర్స్ తో తెలుగు టైటాన్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ను ఫేవరేట్ గా పరిగణిస్తున్నప్పటికీ, అండర్ డాగ్ గా ఆ జట్టు బరిలోకి దిగుతుంది. మొదట్లో తలపడి, మద్యలో తడబడి, చివర్లో పుంజుకున్న జైపూర్ జట్టుతో తెలుగు టైటాన్స్ జట్టుకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో జట్టులో స్థైర్యం నింపేందుకు నిర్వాహకులు పవన్ కల్యాణ్ ను మ్యాచ్ కు ఆహ్వానించారు. దీంతో ఆయన కూడా మ్యాచ్ చూసేందుకు రానున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News