: ‘హోదా’పై రాజ్యసభలో చర్చ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో పెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లుపై రాజ్యసభలో ఈరోజు నిర్వహించతలపెట్టిన చర్చ ప్రారంభమయింది. చర్చలో తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ.. నిన్న వెంకయ్యనాయుడు చెప్పిన సమాధానంపై తాము సంతృప్తిగా లేమని అన్నారు. నిన్న సభలో అన్ని పార్టీలు ఏపీకి మద్దతు ఇచ్చాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రానికి మరో రూపంలో సాయం చేయండి అని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. మరికాసేపట్లో ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు.