: ఫ్లిప్ కార్ట్ లో 1,000 మంది ఉద్యోగుల మెడపై వేలాడుతున్న కత్తి!


దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో వెయ్యి మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు పనితీరు కనబరచలేకపోయిన కారణంగానే సదరు ఉద్యోగులపై వేటు వేసేందుకు ఫ్లిప్ కార్ట్ రంగం సిద్ధ చేస్తున్నట్లు సమాచారం. ఆశించిన మేర పనితీరు కనబరచలేని వారిని ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఆ సంస్థ... లేని పక్షంలో వేతనాల్లో భారీ కోత విధిస్తామని హెచ్చరించిందట. ఈ మేరకు కంపెనీకి చెందిన ఇద్దరు సీనియర్ ఉద్యోగులు ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ ఆశించిన మేర ఫలితాలను రాబట్టలేకపోయిన వారిని సాగనంపడం సర్వసాధారణమేనని కూడా వారు వాదించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News