: కాచిగూడలో బిల్డింగ్ పైనుంచి పడి తల్లీబిడ్డల మృతి!
హైదరాబాద్‌లోని కాచిగూడలో ఈరోజు ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్‌పై నుంచి పడి రెండేళ్ల బాలుడు, తల్లి మృతి చెందారు. అయితే బిల్డింగ్‌పై నుంచి తల్లీబిడ్డలని ఎవరో కావాలనే తోసేశారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో వారి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు వారి మృతిపై ఆరా తీస్తున్నారు. వారింట్లో కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు స్థానికులు, బంధువులని అడిగి తెలుసుకుంటున్నారు. దర్యాప్తు అనంతరం వారి మృతికిగల కారణాలని వెల్లడిస్తామని పేర్కొన్నారు.