: గుంటూరు జిల్లా బెల్లంకొండలో 9 అడుగుల కొండ చిలువ
గుంటూరు జిల్లా బెల్లంకొండలో 9 అడుగుల కొండ చిలువ కనపడడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. వాటర్ ప్లాంట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున కొండ చిలువ కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. అయితే, కొంత మంది యువకులు ధైర్యం చేసి దానిని చంపివేశారు. కొండచిలువ వచ్చిన సమయంలో పిల్లలు, మేకలు, ఇతర జంతువులు లేకపోవడంతో ఎటువంటి విషాద సంఘటనలు జరగలేదంటూ గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.