: నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ తుది దశలో ఉన్నందున ప్రతి శుక్రవారం జరిగే విచారణకు తప్పనిసరిగా తమ ముందు హాజరుకావాలంటూ జగన్ ను సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న తాను ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకాలేనన్న జగన్ వాదనతో ఏకీభవించిన కోర్టు ప్రతి విచారణకు వ్యక్తిగతంగా హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. తాజా విచారణకు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాలతోనే జగన్ కోర్టుకు వచ్చినట్లు సమాచారం.