: రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజును పరామర్శించిన వైఎస్ జగన్
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజును వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనారోగ్యం కారణంగా నిమ్స్ లోని మిలీనియం బ్లాకులో చికిత్స పొందుతున్న కృష్ణంరాజును జగన్ నిన్న కలిసి మాట్లాడారు. అక్కడి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జగన్ వెంట పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కాగా, పలు విభాగాలకు చెందిన హెచ్ఓడీలు కృష్ణమరాజుకు వైద్యపరీక్షలు నిర్వహించి, వైద్యసేవలందింస్తున్నారు.