: లాహోర్‌లో బీఎస్ఎఫ్, పాక్ రేంజర్ల మధ్య చర్చలు.. సరిహద్దు సమస్యలను ప్రస్తావించిన భారత్
సార్క్ సమావేశంలో పాల్గొనేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), పాక్ రేంజర్స్ మధ్య లాహోర్‌లో ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ ఉల్లంఘన, చొరబాట్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ కేకే శర్మ ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ ప్రతినిధి బృందం, పాకిస్థాన్ రేంజర్స్(పంజాబ్) డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ ఉమర్ ఫరూఖ్ బుర్కి చర్చల్లో పాల్గొన్నారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినట్టు బీఎస్ఎఫ్ పేర్కొంది.