: ప్రధాని హామీని అమలు చేయాల్సిన బాధ్యత మీకు ఉందా? లేదా?: డిగ్గీ రాజా
ప్రధాని హామీ ఇస్తే.... దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఉందా? లేదా? అని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని బీజేపీ నెరవేరుస్తుందా? లేదా? అనేది చెప్పాలని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా 'పదేళ్ల హామీ'పై వెంకయ్యనాయుడు ఇంకా నిలబడ్డారా? లేదా? అన్నది స్పష్టం చేయాలని అన్నారు. హైదరాబాదు చుట్టూ ఆదాయవనరులు ఏర్పాటు చేయడం వల్ల ఏపీ పూర్తిగా నష్టపోయిందని ఆయన తెలిపారు. ఏపీ సీఎం ప్రత్యేకహోదాపై ఎందుకు పోరాడడం లేదో తనకు తెలియదని, ఆయన ఎందుకు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయలేకపోతున్నారో తనకు తెలియదని ఆయన చెప్పారు. ఆయన అలా చేయకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేక వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? అని ఆయన నిలదీశారు.