: మాయావతిపై ఎఫ్ఐఆర్ కు బీహార్ కోర్టు ఆదేశాలు
గతవారంలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీహార్ లోని వైశాలి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమెతో పాటు పార్టీ నేతలు నసీముద్దీన్ సిద్ధిఖి, రామ్ అచల్ రాజ్ బహార్, మేవా లాల్ లపై కూడా కేసులు పెట్టాలని న్యాయమూర్తి జైరాం ప్రసాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 21వ తేదీన ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, బీజేపీ నేత దయాశంకర్, ఆయన భార్య, కుమార్తెలను లక్ష్యం చేసుకోవాలని కోరగా, దీనిపై అజిత్ సింగ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది.