: అత్యాచార నిందితుడిని చెప్పుతో కొట్టిన తృప్తీ దేశాయ్... వైరల్ అవుతున్న వీడియో!


మహిళలను దేవాలయాల గర్భగుడుల్లోకి అనుమతించాలని పోరాడి విజయం సాధించిన హక్కుల కార్యకర్త, భూమాతా బ్రిగేడ్ వ్యవస్థాపక సభ్యురాలు తృప్తీ దేశాయ్ మరోమారు వార్తల్లో నిలిచారు. పుణె సమీపంలోని ఓ గ్రామంలో యువతిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న 25 ఏళ్ల యువకుడిని నలుగురి ముందూ చెప్పుతో కొట్టారు. ఓ యువతిని వివాహం చేసుకుంటానని ప్రమాణం చేసి, ఆపై కోరిక తీర్చుకుని వదిలేసి, ఆమె అబార్షన్ చేయించుకోవడానికి కారణమైన కామాంధుడికి స్వయంగా దేహశుద్ధి చేశారు. ఓ దుర్మార్గుడికి గుణపాఠం నేర్పాలన్న ఉద్దేశంతోనే తానీపని చేసినట్టు చెప్పారు. "మహిళలపై ఈ తరహా దుర్మార్గాలు ఎక్కడ జరిగినా నేను వచ్చి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాను. అందుకు భయపడేది లేదు" అని ఆమె వ్యాఖ్యానించారు. నిందితుడిని ఆమె చెప్పుతో కొడుతున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News