: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. వీసీల నియామక ఉత్తర్వులు రద్దు
తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు హైకోర్టు షాక్ ఇచ్చింది. రెండు రోజుల క్రితమే 9 మంది వైస్ ఛాన్సలర్‌లను నియమిస్తూ రాష్ట్ర సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. వీసీల నియామక ఉత్తర్వులు రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తీర్పు చెప్పింది. అర్హతల ఆధారంగా నియామకం జరగలేదని హైకోర్టు స్పష్టం చేసింది. నియామకానికి సంబంధించి అర్హతలు, నిబంధనలు ఉద్దేశిస్తూ జారీ చేసిన జీవోను కూడా నిలిపివేసింది. అయితే, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు తీర్పు అమలును నాలుగు వారాల పాటు హైకోర్టు రిజర్వ్ చేసింది.