: ఏపీలో నలుగురు ఐఏఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జాయింట్ కలెక్టర్ గా ఉన్న చెరుకూరు శ్రీధర్ ను సీఆర్డీఏ కమిషనర్ గా నియమించింది. సీఆర్డీఏ కమిషనర్ గా ఇప్పటి వరకు కొనసాగిన శ్రీకాంత్ ను సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీగా నియమించింది. విజయనగరం జిల్లా కలెక్టర్ గా ఉన్న ఎంఎం నాయక్ ను ఏపీడీసీఎల్ చైర్మన్ గా, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గా ఉన్న వివేక్ యాదవ్ ను విజయనగరం జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.