: చర్చలు సఫలం.. మల్లన్నసాగర్ కోసం పల్లెపహాడ్ రైతులను ఒప్పించిన హరీశ్‌రావు
తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈరోజు మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ రైతులు, యువకులతో చేసిన చర్చలు సఫలమయ్యాయి. ప్రాజెక్టు కోసం తమ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ గ్రామస్తులు ఒప్పుకున్నారు. జిల్లాలోని గజ్వేల్‌లో మల్లారెడ్డి గార్డెన్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రోస్తో కలిసి హరీశ్‌రావు రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. చర్చల పలితంగా రైతులు తమ భూములను ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. రైతులు తమకు సహకరిస్తున్నందుకు హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.