: మనల్ని శక్తిమంతంగా తయారుచేయటం కోసమే కష్టాలు వస్తాయని కలాం చెప్పేవారు: ట్విట్ట‌ర్‌లో జగన్


భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. మిస్సైల్‌ మ్యాన్‌గా పేరొందిన అబ్దుల్‌ కలాం గతేడాది జులై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. క‌లాం చెప్పిన మాట‌ల్ని జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా గుర్తు చేసుకున్నారు. మనల్ని మ‌నం మ‌రింత శ‌క్తిమంతులుగా రూపుదిద్దుకోవ‌డం కోసమే కష్టాలు వస్తాయని క‌లాం చెప్పేవార‌ని ఆయ‌న పేర్కొన్నారు. క‌లాం త‌న‌ ఆలోచనలు, చర్యలతో భార‌త్‌ని బలోపేతం చేశార‌ని జ‌గ‌న్ ట్వీట్ చేశారు. క‌లాం న‌డిచిన బాట‌లోనే మ‌నం న‌డిస్తే అదే ఆయ‌న‌కు మ‌న‌మిచ్చే ఉత్తమమైన శ్రద్ధాంజలని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News