: రాయపూడిలో చర్చి తొలగింపుపై వాదనలు విన్న హైకోర్టు.. స్టే విధించిన న్యాయస్థానం
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని చర్చి తొలగింపు అంశంలో వేసిన పిటిషన్పై హైకోర్టు ఈరోజు వాదనలు వింది. అనంతరం చర్చి తొలగింపుపై స్టే విధించింది. కొన్ని రోజుల క్రితం అధికారులు చర్చిని తొలగించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పొన్నవొలు సుధాకర్ రెడ్డి వాదనలు విన్న అనంతరం హైకోర్టు స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.