: ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు


తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. చతార్ పూర్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వార్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకే ఎమ్మెల్యే నివాసానికి ఐటీ అధికారులు చేరుకున్నారు. కాగా, ఈ సంఘటనపై స్పందిస్తూ ఆప్ ముఖ్య నేత దిలీప్ పాండే ఒక ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సీబీఐ, ఏసీబీలను తమ పార్టీ నాయకులపై ప్రయోగించారని, ఇప్పుడు ఐటీ శాఖను కూడా ప్రధాని మోదీ రంగంలోకి దింపారని అన్నారు. ఆప్ ఎవరికి లొంగదు, ఎవరి ముందూ తలవొంచదని ఆ ట్వీట్ లో మండిపడ్డారు.

  • Loading...

More Telugu News