: పూతలపట్టు ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం


కాణిపాకంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్వహించ‌త‌ల‌పెట్టిన 'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైఎస్సార్' కార్య‌క్ర‌మానికి వెళుతోన్న చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ తృటిలో ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ ప్ర‌యాణిస్తోన్న వాహ‌నాన్ని ఓ ఇన్నోవా కారు ఢీ కొట్టింది. అయితే, ఆయ‌నకు ఎటువంటి గాయాలు కాలేదు. ఆయ‌న ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఊపిరి పీల్చుకున్నారు. సునీల్ ప్రయాణిస్తోన్న కారు దెబ్బ‌తిన్న‌ట్లు తెలుస్తోంది. సునీల్ మరో కారులో కాణిపాకం బయలుదేరారు. ప్ర‌మాదానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News