: మేకను మింగిన కొండచిలువ.. కదలలేని స్థితిలో ఉన్న వైనం!


ఓ మేకను కొండ‌ చిలువ మింగిన ఘ‌ట‌న కర్ణాటక శూలగిరి సమీపంలోని వరదాపురం గ్రామంలో తాజాగా చోటు చేసుకుంది. మేక‌ను మింగ‌డంతో 13 అడుగుల కొండచిలువ ఉన్న చోట‌నుంచి క‌ద‌ల‌లేని ప‌రిస్థితుల్లో క‌న‌బ‌డింది. గ్రామంలోని పొలంలో కొండచిలువ తిరుగుతోంది. అదే స‌మ‌యంలో ఓ మేక త‌ప్పిపోయింది. మేక కోసం వెళ్లిన వారికి అక్క‌డ కొండచిలువ క‌ద‌లలేని ప‌రిస్థితిలో క‌నిపించింది. దీంతో తాము వెతుకుతోన్న మేక‌ను కొండచిలువే మింగేసింద‌ని గ్రామస్తులు నిర్ధారించుకున్నారు. కొండ‌చిలువ‌ను చూడ‌డానికి స్థానికులు పెద్ద సంఖ్య‌లో క్యూ క‌డుతున్నారు.

  • Loading...

More Telugu News