: మరాట్వాడా నుంచి అదృశ్యమైన 100 మంది ముస్లింలు... ఉగ్రవాదులుగా మారినట్టు అనుమానం!
మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతం నుంచి దాదాపు 100 మంది ముస్లిం యువకులు అదృశ్యమైనారని, వారంతా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లో చేరి ఉండవచ్చని శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు స్టేషన్లలో ఎన్నో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిలో అత్యధికుల మనసులను బలవంతంగా ఉగ్రవాదం వైపు ప్రభావితం అయ్యేలా చేశారని ఆరోపించారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ ఐఎస్ఐఎస్ కు మద్దతు ఇస్తోందని అన్నారు. ఈ రీజియన్ లోని పర్బని ప్రాంతంలో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన ముస్లిం యువకుడిని విచారించగా, ఉగ్ర లింకులు బయటపడ్డాయని, పోలీసులు సైతం అదృశ్యమైన వారంతా ఉగ్రవాదుల్లో చేరుంటారని భావిస్తున్నారని తెలిపారు.