: షార్ రాకెట్ ప్రయోగాన్ని అడ్డుకున్న మిస్సింగ్ విమానం!
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం) రేపు ప్రయోగించాల్సిన అడ్వాన్డ్స్ టెక్నాలజీ వాహక నౌక ప్రయోగం వాయిదా పడ్డట్టు సమాచారం. ఆరు రోజుల నాడు బంగాళాఖాతం మధ్యలో అదృశ్యమైన భారత వాయుసేన విమానం ఏఎన్-32 కోసం పలు నౌకలు, విమానాలు, చాపర్లు సముద్రం మధ్యలో ఎగురుతున్నందున ఈ రాకెట్ ప్రయోగానికి ఎయిర్ ట్రాఫిక్ అనుమతి లభించలేదని సమాచారం. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేశామని, దీన్ని తిరిగి ఎప్పడు ప్రయోగించేది త్వరలోనే నిర్ణయిస్తామని షార్ వర్గాలు వెల్లడించాయి.