: ట్రంప్‌తో తలపడేది హిల్లరీనే.. ఖరారైన అభ్యర్థిత్వం
అమెరికా ఎన్నికల చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున బరిలోకి దిగిన హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారైంది. విదేశాంగ శాఖ మాజీ మంత్రి అయిన హిల్లరీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని డెమోక్రటిక్ పార్టీ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న తొలి మహిళగా హిల్లరీ చరిత్ర సృష్టించారు.