: భారత్ వల్లే ఇది సాధ్యమైంది!: బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపిన క్రికెట్ సౌతాఫ్రికా


సౌతాఫ్రికా క్రికెట్ పట్ల విశాల దృక్పథంతో వ్యవహరించిన బీసీసీఐకి ధన్యవాదాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా తెలిపింది. దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఎ) సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని భారత్ తమకు చేసిన మేలును ఆ జట్టు తలచుకుంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన 'జయహో' గీతానికి వేదికపై నృత్యం ప్రదర్శిస్తున్న వేళ బోర్డు అధికార ప్రతినిధి మాట్లాడుతూ, జాతి వివక్ష కారణంగా సుమారు నాలుగు దశాబ్దాల పాటు బహిష్కరణకు గురైన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడడంలో భారత్ పాత్ర వెలకట్టలేనిదని పేర్కొంది. భారత దేశం వల్లే తాము మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టామని, తమ పట్ల విశాల హృదయంతో వ్యవహరించిన భారతదేశానికి కృతజ్ఞతలని సీఎస్ఏ వీడియో సందేశంలో పేర్కొంది. కాగా, జాతి వివక్ష కారణంగా గతంలో సఫారీ జట్టు కేవలం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో మాత్రమే క్రికెట్ ఆడేది. నిషేధం ఎత్తివేసే విషయంలో భారత్ వ్యవహరించిన తీరుతో అంతర్జాతీయ పోటీల్లో ఆడుతోంది.

  • Loading...

More Telugu News