: రాజేష్ ఖన్నా ఏంటనే విషయం అందరికీ తెలుసు: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన డింపుల్ కపాడియా
హిందీ సినిమాకు సంబంధించి మొదటి సూపర్ స్టార్ అయిన రాజేష్ ఖన్నాపై మరో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రాజేష్ ఖన్నా ఒక చెత్త నటుడు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ ఖన్నా ఆ వెంటనే స్పందించింది. తాజాగా, రాజేస్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా ఈ వ్యాఖ్యలపై తన దైన శైలిలో సమాధానమిచ్చింది. ‘బాలీవుడ్ లైఫ్. కామ్’ అనే వెబ్ సైట్ కథనం ప్రకారం, ‘తమ సొంత అభిప్రాయాన్ని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. హిందీ సినిమాకు రాజేష్ ఖన్నా ఏమి చేశారు? ఆయన సాధించిన విజయాలు ఏమిటి? వంటి అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. రాజేష్ ఖన్నా ఏంటనే విషయం, మీకు తెలుసు, నాకు తెలుసు, లక్షలాది ఆయన అభిమానులకు బాగా తెలుసు’ అని డింపుల్ పేర్కొన్నట్లు ‘బాలీవుడ్ లైఫ్.కామ్’లో పేర్కొంది.