: ముంబయి ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా దించివేత.. 309 మంది ప్రయాణికులు సురక్షితం
ముంబయి ఎయిర్‌పోర్టులో కొద్ది సేపటి క్రితం ఓ విమానాన్ని అత్యవసరంగా దించారు. దుబాయ్ నుంచి మాల్దీవులు వెళుతుండగా విమానంలో పొగలు రావడంతో అత్యవసరంగా దించివేసినట్లు తెలుస్తోంది. విమానంలో ఉన్న 309 మంది ప్రయాణికులు సహా విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం ప్రమాదానికి గురవుతోందన్న సమాచారంతో ముంబయి ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.