: బ్రిటన్ బిలియనీర్ అత్తను కిడ్నాప్ చేసిన బ్రెజిల్ గ్యాంగ్ స్టర్లు... రూ. 250 కోట్లకు డిమాండ్!
బ్రిటన్ లో నాలుగో అతిపెద్ద ధనవంతుడు, ఫార్ములా వన్ టైకూన్ గా పేరున్న బెర్నీ ఎస్సెల్ స్టోన్ (85) అత్తను కిడ్నాప్ చేసిన బ్రెజిల్ గ్యాంగ్ స్టర్లు రూ. 250 కోట్లను డిమాండ్ చేస్తున్నారు. బెర్నీ సతీమణి ఫాబియానా పోస్లీ తల్లి అపరిషిదా షుంక్ ను ఆమె ఇంటి బయటే మాటువేసి కిడ్నాప్ చేసిన గ్యాంగ్ స్టర్ల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం రాగా, వారిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, 2009లో బ్రెజిల్ లో ఫార్ములా వన్ పోటీలకు బెర్నీ హాజరైన వేళ, ఆ దేశ ఫార్ములా వన్ డైరెక్టర్ గా ఉన్న ఫాబియానా (38)ను తొలిసారిగా చూశాడు. ఆ వృద్ధాప్యంలోనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని లండన్ లో కాపురం పెట్టారు.