: తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు
కొడుకు వరుస వారెవ్వరూ ముందుకు రాకపోవడంతో కూతురే తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరు గ్రామంలో జరిగింది. అనారోగ్యం కారణంగా ఆ గ్రామానికి చెందిన మునస్వామి (70) నిన్న చనిపోయాడు. ఆయనకు కొడుకులు లేరు. ఈశ్వరమ్మ, సుబ్బమ్మ అనే ఇద్దరూ కూతుళ్లే ఉన్నారు. తమ బంధువుల్లో కొడుకు వరుస అయిన వారెవ్వరూ తమ తండ్రి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో, సుబ్బమ్మ ఆ బాధ్యతలు నిర్వహించింది.