: ‘చలో మల్లన్నసాగర్’.. హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత


హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరికొద్ది సేపట్లో ‘చలో మల్లన్న సాగర్’ యాత్రను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, జైపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పలువురు సీనియర్ నేతలు గాంధీభవన్ కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి మల్లన్న సాగర్ కు నేతలు బయలుదేరి వెళతారు. ఈ నేపథ్యంలో డీసీపీ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. దీంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News