: కాసేపుంటే సజీవదహనం చేసుండేవాళ్లు: గుజరాత్ లో దాడికి గురైన దళితులు


గుజరాత్ లోని రాజులా పట్టణంలో ఆవు చర్మాన్ని వలుస్తున్నారన్న ఆరోపణలతో గో రక్షక దళ సభ్యులు కట్టేసి కొట్టిన ఏడుగురు దళిత యువకులు మీడియా ముందుకు వచ్చారు. తమను కొట్టిన తరువాత సజీవ దహనం చేయాలని వారు మాట్లాడుకున్నారని, కొంతసేపు ఆలస్యం అయ్యుంటే, తమను ఓ చిన్న గదిలో పడేసి కిరసనాయిల్ పోసి తగులబెట్టి ఉండేవారని, సకాలంలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకోవడంతోనే బతికామని ప్రవీణ్ అనే బాధితుడు చెప్పాడు. ఇద్దరిని కిరోసిన్ తెమ్మని కూడా వారు పంపించారని వివరించాడు. తమ వర్గానికే చెందిన కొందరు, సజీవదహనం చేసే ఆలోచనలో గో రక్షణ దళ సభ్యులున్నట్టు పోలీసులకు చెప్పడంతోనే వారు త్వరగా వచ్చారని అన్నారు. మే 22న జరిగిన ఈ ఘటనలో, వీరందరినీ వాహనానికి కట్టేసి ఇనుప రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లతో ఇష్టానుసారం కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, పార్లమెంట్ సైతం స్తంభించిన సంగతి తెలిసిందే. బాధితులకు రూ. 4 లక్షల పరిహారం చొప్పున ప్రకటించిన కేంద్రం, వారిని నిర్దయగా కొట్టిన వారిని అరెస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News