: మాస్ మసాలా సినిమాల్లో నటించాలని ఉంది: అలియా భట్
మంచి మాస్ మసాలా సినిమాలో నటించాలని ఉందని అలియా భట్ తెలిపింది. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అలియా మాట్లాడుతూ, కేవలం ఆర్ట్ సినిమాలు, హీరోయిన్ ప్రాధాన్యమున్న సినిమాల్లో మాత్రమే నటిస్తానని అనుకోవద్దని తెలిపింది. హైవే, ఉడ్తా పంజాబ్ సినిమాల్లో మంచి నటన కనబరిచిందని విమర్శకుల ప్రశంసలు పొందిన అలియా, అలాంటి పాత్రల్లోనే నటిస్తానని ఊహించవద్దని, కత్రినా కైఫ్ లా ‘మై నేమ్ ఈజ్ షీలా.. షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’ వంటి పాత్రల్లో కూడా నటించాలని అనుకుంటున్నానని చెప్పింది. రియలిస్టిక్ సినిమాలతో పాటు, మాస్ మాసాలా సినిమాలు కూడా తనకు చాలా ఇష్టమని చెప్పింది.