: జ్వరంతో చికిత్సకు వచ్చిన బాలికపై అహ్మదాబాద్ లోని పాక్ డాక్టర్ లైంగిక దాడి


భారత్ లో పాకిస్థాన్‌ వైద్యుడు అత్యాచారయత్నం చేశాడు. పాకిస్థాన్ కు చెందిన వైద్యుడు డాక్టర్ జైరామ్ లడ్హానీ వీసా గడువు పొడిగించుకుని గత నాలుగేళ్లుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్దార్ నగ‌ర్‌ లో నివాసముంటున్నాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 16 ఏళ్ల బాలిక చికిత్స కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లగా, కొన్ని మందులు ఇచ్చిన జైరామ్ లడ్హానీ సాయంత్రం మరోసారి వైద్యపరీక్షలకు రావాలని సదరు యువతికి సూచించాడు. దీంతో ఆ సాయంత్రం మరోసారి వెళ్లిన ఆ యువతిపై లైంగికదాడికి జైరామ్ లడ్హానీ ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో గతంలో చాలా మంది యువతులపై అత్యాచారయత్నం చేసినట్టు తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News