: జీవితం ఆట కాదు.. రోడ్లపై ‘పోకెమాన్’ ఆడొద్దంటూ పోలీసుల హెచ్చరిక
‘పోకెమాన్’ మొబైల్ గేమ్ ఆడుతూ రోడ్డుపై ఎటుపోతున్నామో తెలియనివాళ్లు, చెట్లు ఎక్కుతున్నవారు, వాహనాల కింద పడుతున్న వారికి కొదవలేదు. ఈ సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ముంబయి పోలీసులు నగరవాసులకు తాజాగా ఒక హెచ్చరిక జారీ చేశారు. జీవితం ఆట కాదు, రోడ్లపై ఎవరూ ఆటలు ఆడొద్దంటూ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. కాగా, భారత్ లోకి అధికారికంగా ఈ గేమ్ విడుదల కానప్పటికీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఫైల్ డౌన్ లోడ్ చేసుకుని ఆడేస్తుండటం గమనార్హం.