: బౌలర్ల వైఫల్యం ఫలితమే ఈ ఓటమి: హోల్డర్


టీమిండియా చేతిలో తొలిటెస్టు ఘోర వైఫల్యంపై విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ నిస్సహాయత వ్యక్తం చేశాడు. జట్టు కనీస స్థాయిలో కూడా పోరాట పటిమ చూపలేదని పేర్కొన్నాడు. బౌలింగ్ లో ఘోరవైఫల్యం చెందామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు భారీ స్కోరు చేసే అవకాశం ఇవ్వడం ద్వారా ముందే లొంగిపోయామని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో తమ జట్టు బౌలింగ్ బాలేదని అంగీకరించాడు. ప్రత్యర్థి జట్టుపై కనీస ఒత్తిడి తేలేకపోయామని చెప్పాడు. తాము బౌలింగ్ చేసిన విధానం టెస్టు క్రికెట్ కు సరిపోదని పేర్కొన్నాడు. బౌలింగ్ విభాగంలో వైఫల్యమే తొలిటెస్టు ఓటమికి కారణమని చెప్పిన హోల్డర్, బౌలింగ్ విభాగంలో చాలా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. తరువాత జరగనున్న టెస్టు నాటికి పుంజుకుని టీమిండియాకు గట్టిపోటీ ఇస్తామని హోల్డర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News