: జైరాం రమేష్, రేణుకా చౌదరిపై సభా హక్కుల తీర్మానం


రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేష్‌, రేణుకాచౌదరిలపై శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) పార్టీ సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. గత శుక్రవారం రాజ్యసభ వాయిదా పడిన అనంతరం రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదాపై చర్చ జరగనీయకుండా, బీజేపీ సభ్యులు ఆప్ ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారని జైరాం రమేష్, రేణుకా చౌదరి పార్లమెంటు బయట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో తమ ఆందోళనను ఎస్‌ఏడీ నేత, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో జైరాం రమేష్, రేణుకాచౌదరి ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు వారిద్దరూ క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో సభాహక్కుల తీర్మానం ఎదుర్కోవాలని ఎస్‌ఏడీ నేత సుఖ్‌ దేవ్‌ సింగ్‌ దిండ్షా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వారిపై సభా హక్కుల నోటీసు ఇచ్చారు.

  • Loading...

More Telugu News