: గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కూలీ హతం
గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో వ్యవసాయ కూలి హత్యకు గురైన సంఘటన నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం జరిగింది. వ్యవసాయ కూలి శ్యామ్ (45) ఇంట్లోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కత్తులతో నరికి చంపి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా, శ్యామ్ భార్యా పిల్లలు పుట్టింటికి వెళ్లారని, ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్పారు.