: వేడినీటితో స్నానం చేస్తున్నారా? అయితే, మీరు ఎక్సర్‌సైజు చేస్తున్నట్లే!


చల్లటి నీటితో క‌న్నా వేడి నీటితోనే స్నానం చేయడానికి ఎంతో మంది ఇష్ట‌ప‌డ‌తారు. వేడి నీటితో స్నానం చేస్తే హాయిగా ఉన్న‌ట్లు ఫీల‌వుతారు. వేడినీటితో స్నానం చేస్తే మ‌న‌సు ఒత్తిడి నుంచి దూరమ‌యిన‌ట్లు భావిస్తారు. ఆ అల‌వాటు మంచిదేన‌ని లండ‌న్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అది ఒక ఎక్సైర్‌సైజుతో స‌మాన‌మ‌ని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేసే వారు గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చని, అంతేగాక‌, రక్తపోటు, మధుమేహం వంటి రోగాలు సైతం త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని వారు చెబుతున్నారు. 2,300 మందిపై పరిశోధన చేసిన శాస్త్ర‌వేత్త‌ల బృందం ఈ అంశాన్ని పేర్కొంది. ఎంపిక చేసిన వారితో 30 నిమిషాలు బ్రిస్క్‌వాక్ చేయించ‌డంతో 140 కేలరీలు ఖ‌ర్చయినట్లు, అనంత‌రం వారికి వేడినీటితో స్నానం చేయించ‌న‌ట్లు తెలిపింది. వేడి నీటితో స్నానం చేశాక‌ కూడా 140 కేలరీలు ఖర్చయినట్లు వారు తెలిపారు. 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్‌ వంటి ఎక్సర్ సైజుతో వేడినీటి స్నానం సమానమని వారు తెలిపారు. అయితే, వేడినీటి స్నానంతో కన్నా ఎక్కువ‌గా కేల‌రీలు ఖ‌ర్చ‌వ్వాలంటే అరగంట సైక్లింగ్ చేయాల‌ని, సైక్లింగ్‌తో శ‌రీరంలోని 630 కేలరీలు ఖర్చవుతాయని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News