: మాజీ డీజీపీ జేవీ రాముడు దంపతులకు చంద్రబాబు ప్రత్యేక విందు!
ఏపీ డీజీపీగా పనిచేసి మొన్న పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేవీ రాముడికి నిన్న ఘన సత్కారం లభించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... జేవీ రాముడు డంపతులకు తన నివాసంలో ప్రత్యేకంగా విందు ఇచ్చారు. డీజీపీగా మంచి పనితీరు కనబరచిన జేవీ రాముడు... రాష్ట్ర విభజన సమయంలో ఏపీ పోలీసు వ్యవస్థలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వ్యవహరించారు. ఈ క్రమంలో పదవీ విరమణ పొందిన ఆయనకు చంద్రబాబు నిన్న కృష్ణా నది తీరాన ఉన్న తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చారు. విందుకు ముందు చంద్రబాబు ఆయనను ఘనంగా సత్కరించారు.