: గోల్ఫర్ గా వెంకయ్య!... రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, ఏపీ మంత్రి నారాయణలతో కలిసి సరదా ఆట!
బీజేపీ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిన్న గోల్ఫర్ అవతారం ఎత్తారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో కొత్తగా ఏర్పాటైన గోల్ఫ్ కోర్సును నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు, ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణలతో కలిసి ఆయన ప్రారంభించారు. సముద్ర తీరం వెంట నిర్మించిన ఈ గోల్ఫ్ కోర్సును ఆసక్తిగా పరిశీలించిన వెంకయ్య... పోర్టు యాజమాన్యాన్ని అభినందించారు. ఆ తర్వాత సురేశ్ ప్రభు, నారాయణలతో కలిసి గోల్ఫ్ స్టిక్ పట్టిన వెంకయ్య... కాసేపు గోల్ఫ్ ఆడారు. తలపై టోపీ పెట్టుకుని వెంకయ్య గోల్ఫ్ ఆడిన తీరును అక్కడి వారు ఆసక్తిగా తిలకించారు.