: నా మనవళ్లు నన్ను అలానే పిలుస్తారు... నా కొడుకులు కూడా పిలిస్తే హ్యాపీ!: ఆనం వివేకా
‘నా మనవళ్లు కూడా నన్ను వివేకా అనే పిలుస్తున్నారు. నా మిత్రులందరూ కూడా నన్ను వివేకా అనే పిలుస్తారు. నా బిడ్డలు కూడా వివేకా అని పిలిస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ’ అని టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా వయసును గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. పెరుగుతున్న వయసు గురించి నేను ఆలోచించను. అలా ఆలోచించకుండానే నేను ముందుకుపోతాను’ అని వివేకా చెప్పారు. ఏజ్, గేజ్ కాదు.. ఏజైనా గేజైనా దాంట్లో ఇమిడిపోవడానికి తాను ప్రయత్నం చేస్తానని, అవి సమస్య కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.