: కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదే, కానీ బయటకు రావాల్సి వచ్చింది: టీఆర్ఎస్ నేత డీఎస్


కాంగ్రెస్ పార్టీ తనకు కన్నతల్లి కంటే ఎక్కువేనని, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా బయటకు రావాల్సి వచ్చిందని టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీని చూడలేదని, ఆ పార్టీ తనకు కన్నతల్లి కంటే ఎక్కువేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే పరిస్థితి వస్తుందని కూడా తాను ఊహించలేదన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పనికట్టుకుని మరీ, తనను ఇబ్బంది పెట్టాలని చూశారని తన మనసులోని మాటను చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు చేశానని, పార్టీకి ఎటువంటి నష్టం లేకుండా చూశానని అన్నారు.

  • Loading...

More Telugu News