: సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలి: రేవంత్ రెడ్డి


‘మల్లన్న సాగర్’ ముంపు బాధితులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులపై కాల్పులకు తెలంగాణ ప్రభుత్వమే తెగబడిందని ఆరోపించిన ఆయన, రైతులకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ రేపు మెదక్ జిల్లా బంద్ కు టీడీపీ పిలుపునిస్తోందన్నారు. కాగా, మల్లన్న సాగర్ ముంపు బాధితులు జాతీయ రహదారిపై బైఠాయించేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. ఆ క్రమంలో పోలీసులు లాఠిఛార్జితో పాటు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. లాఠిఛార్జి సంఘటనలో తెలంగాణ తెలుగు రైతు అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి సహా పలువురు గాయపడిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News