: ‘పోకెమాన్’ గేమ్ ఆడుతూ సరిహద్దులు దాటేసిన పిల్లలు
‘పోకెమాన్’ మొబైల్ గేమ్ ఆడుతూ ఏకంగా తమ దేశసరిహద్దులు దాటేశారు కెనడాకు చెందిన ఇద్దరు పిల్లలు. ఆటలో లీనమై పోయిన వారిద్దరూ తమ దేశ సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టారు. దీంతో, అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ కు చెందిన వారు ఆ ఇద్దరు పిల్లలను తిరిగి వారి కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. కాగా, ‘పోకెమాన్’ ఆడుతూ పెద్దలు, పిల్లలు అందరూ తమకు తెలియకుండానే సమస్యల్లో చిక్కుకుంటున్నారు. అమెరికాలో ఒక మహిళ ఈ గేమ్ ఆడుతూ చెట్టెక్కేయడం, తిరిగి దిగలేక నానా అవస్థలు పడటం, ఎమర్జెన్సీ సర్వీసు వచ్చి ఆమెను చెట్టుపైనుంచి దింపడం వంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే జరిగాయి. ఈ గేమ్ తో ఇటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకోవడమెందుకని, తమ నిబంధనలకు విరుద్ధమని భావించిన సౌదీ అరేబియా ఈ గేమ్ పై నిషేధం విధిస్తూ ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే.