: అనుభవం లేని ఇంజనీర్ కారణంగానే దారుణం జరిగింది: బీజేపీ నేత కిషన్ రెడ్డి
హైదరాబాద్ ఫిలింనగర్ లో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం కూలడానికి కారణం అనుభవం లేని ఇంజనీరేనని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పిల్లర్లకు, పిల్లర్లకు మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, ఎటువంటి మెటీరియల్ వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి సదరు ఇంజనీర్ కు పూర్తిగా తెలియకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమన్నారు.