: ఫిల్మ్ నగర్ సంఘటనా స్థలానికి వెళ్లిన మేయర్, బీజేపీ నేత కిషన్ రెడ్డి
హైదరాబాద్ ఫిలింనగర్ లో నిర్మాణంలో ఉన్న రెండస్తుల భవనం కూలిపోయిన సంఘటన స్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ నేత కిషన్ రెడ్డి సందర్శించారు. ఘటన వివరాల గురించి స్థానికులను అడిగి వారు తెలుసుకున్నారు. కాగా, శిథిలాల కింద్ర పలువురు కూలీలు చిక్కుకున్నారు. రెండు మృతదేహాలు వెలికితీయగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆనంద్, అన్సర్ షేక్ గా గుర్తించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ విస్తరణలో భాగంగా ఈ రెండంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు.