: ముగ్గురు చైనా జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించిన మోదీ సర్కారు


చైనాకు చెందిన అధికార న్యూస్ ఏజన్సీ 'క్సిన్హువా' తరఫున ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి వెళ్లిపోవాలని మోదీ సర్కారు ఆదేశించింది. వీరు ముగ్గురూ దేశ భద్రతాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని నిఘా వర్గాలు పసిగట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని 'క్సిన్హువా' బ్యూరో చీఫ్ వూ క్వింగ్, ముంబైలోని రిపోర్టర్లు లూ తాంగ్, షీ యోగ్యాంగ్ లు నిషేధిత ప్రాంతాలను సందర్శించడం, అక్కడి సమాచారాన్ని సేకరించడం వంటి పనులను వీరు చేస్తుండగా, జూలై 31లోగా దేశం విడిచి పెట్టాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. చైనా జర్నలిస్టులకు దేశ బహిష్కరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. వీరి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు, ఓ నివేదికను ఇవ్వగా, దీన్ని పరిశీలించిన హోం శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. కాగా, ఈ ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల వీసా గడువు ముగిసిపోగా, దాన్ని పొడిగించుకుని ఇండియాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. విలేకరుల బహిష్కరణపై చైనా విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News