: క్లోన్ సైట్ల రూపంలో తిరిగొచ్చిన అతిపెద్ద పైరసీ వెబ్ సైట్ 'కిక్ యాస్ టోరెంట్స్'!


ప్రపంచంలోనే అతిపెద్ద పైరసీ వెబ్ సైట్ గా ఉన్న కిక్ యాస్ టోరెంట్స్ ను నిలిపివేసి, దాని యజమాని అర్టెమ్ వాలిన్ ను అరెస్ట్ చేసినప్పటికీ, ఆ వెబ్ సైట్ మరో రూపంలో ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చింది. టోరెంట్స్ క్లోన్ సైట్లు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. కిక్ యాస్ ఇప్పుడు మారిపోయిందని క్యాట్ డాట్ ఏఎం (KAT.am)గా క్లోనింగ్ చేశామని, పలు క్లౌడ్ సర్వర్ల ఆధారంగా దీన్ని అందుబాటులో ఉంచామని క్లోన్ సైట్ల సృష్టికర్త ఒకరు మీడియా సంస్థలకు పంపిన ఈ-మెయిల్ లో వెల్లడించారు. అప్ లోడ్ లు అన్నీ బలమైన క్లౌడ్ ఫ్లేర్ వెనుక దాగుంటాయని తెలిపారు. ఈ తరహా క్లోన్ సైట్లు చాలానే ఉన్నాయని, తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులూ రావని తెలిపారు. ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే, ఈ క్లోన్ సైట్లు మరింతగా మెరుగైనవని, మొబైల్ వర్షన్ ను కూడా ఆవిష్కరించామని పేర్కొన్నారు. గత బుధవారం నాడు సుమారు రూ. 6,700 కోట్ల విలువైన పైరసీ చిత్రాలు, సంగీతం తదితరాలను అందించిందని ఆరోపిస్తూ టోరెంట్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News